Thursday, March 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహ‌ర్మూజ్ జ‌ల‌సంధి గుండా భార‌త్ నౌక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

హ‌ర్మూజ్ జ‌ల‌సంధి గుండా భార‌త్ నౌక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికా, ఇజ్రాయిల్ క‌లిసి ఇరాన్‌పై వైమానికి దాడుల‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ రెండు దేశాల‌పై ప్ర‌తిదాడుల‌కు దిగిన ఇరాన్..చ‌మురు ర‌హ‌ణాకు కీల‌క మార్గ‌మైన..హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని మూసివేసి క‌ట్టుదిట్ట‌మైన నిఘా ఏర్పాటు చేసింది. అదే విధంగా యూఎస్‌, ఇజ్రాయిల్ మిత్ర దేశాల నౌక‌లు అటువైపు వ‌చ్చినా..స‌దురు ప‌డవ‌ల‌పై దాడులు చేస్తామ‌ని హెచ్చ‌రించింది. దీంతో గ‌ల్ప్ దేశాల‌తో పాటు ఆగ్నేయాసియా, ప‌లు యూర‌ప్ దేశాల‌కు చ‌మురును ర‌వాణా చేయ‌డానికి పెద్ద ఆటంకం ఏర్ప‌డింది. తాజాగా హ‌ర్ముజ్ జ‌ల‌సంధి మీద‌గా భార‌తీయ నౌక‌లు రాక‌పోక‌లు సాగించొచ్చున‌ని ఇరాన్ వెల్ల‌డించింది. దీంతో చమురు దిగుమ‌తుల‌ ప‌రంగా ఇండియాకు ఊర‌ట ల‌భించ‌నుంది.

యుద్ధం కార‌ణంగా భార‌త్‌లో చ‌మురు నిల్వ‌ల‌పై అధిక ప్ర‌భావం చూపింది. ప‌లు ప‌ట్ట‌ణాల్లో గ్యాస్ కొర‌త కార‌ణంగా కేంద్రం కూడా రేట్లు పెంచ‌డం కాకుండా ప‌లు ప‌రిమితులు విధించింది. ప్రాధాన్య‌త క్ర‌మంగా ఆయా రంగాల‌కు గ్యాస్ సిలిండ‌ర్ల‌ను కేటాయించాల‌ని పేర్కొంది. క‌మ‌ర్షిల్ సిలిండ‌ర్ల స‌ప్ల‌య్‌ల‌పై ఆంక్ష‌లు విధించింది. దీంతో చిన్న వ్యాపారుల నుంచి బ‌డ‌బ‌డా వ్యాపారుల‌కు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వారంపైగా యుద్ధం కొన‌సాగ‌డంతో..హ‌ర్ముజ్ జ‌ల‌సంధి గుండా రావాల్సిన చ‌మురు నౌక‌లు ఆగిపోయ్యాయి. ఈనేప‌థ్యంలో తాజా ఇరాన్ నిర్ణ‌యంతో భార‌త్ చ‌మురు సంక్షోభం నుంచి కాస్తా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -