Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపెళ్లయిన నెల రోజులకే వరుడి బలవన్మరణం

పెళ్లయిన నెల రోజులకే వరుడి బలవన్మరణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సుల్తాన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన నెల రోజులు కూడా గడవకముందే ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కోసిగి మండలం నాచారం గ్రామానికి చెందిన బోయిని రాము (25) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గత నెల 8వ తేదీన అనితతో వివాహం జరిగింది. వివాహం అనంతరం రాము తన భార్యతో కలిసి బీరంగూడ సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు.

కొత్త కాపురం మొదలైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ మనస్పర్థలు తీవ్రం కావడంతో రాము తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిన్న అతను ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల కారణంగానే రాము ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నెల రోజుల క్రితమే పెళ్లి పందిరిలో సందడిగా కనిపించిన యువకుడు ఇలా విగతజీవిగా మారడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -