నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ ఆలీ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందన్నారు. మంజూరైన లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణం చేపడితే దశలవారీగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అందుతాయని, గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తక్షణ పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మాజీ డిసిసిబి చైర్మన్ రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, సొసైటీ చైర్మన్ భూమయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES