నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. మొత్తం 111 గ్రూప్ 1 ఉద్యోగాలకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఫలితాలను శుక్రవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.