- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ఎదిగే చిన్నారులకు ఆకుకూరలు, కూరగాయలు, చిరు ధాన్యాలు, పప్పులతో కూడిన పోషకాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూప అన్నారు. పోషణ మాసం షెడ్యూల్లో భాగంగా సోమవారం దుబ్బాక మండలం (రామక్కపేట సెక్టార్ పరిధిలోని) రాజక్కపేట అంగన్వాడీ కేంద్రం లో గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రీ స్కూల్ లో భాగంగా ఈసీసీఈ (ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్) పై అవగాహన కల్పించారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సత్యవతి, చైతన్య, చిన్నారుల తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
- Advertisement -