Tuesday, October 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవికీపీడియాకు పోటీగా..గ్రోకిపీడియా

వికీపీడియాకు పోటీగా..గ్రోకిపీడియా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్‌ మ‌స్క్ మ‌రో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌కు తెర‌లేపారు. ఇప్ప‌టికే గ్రోక్, ఎల‌క్ట్రానిక్ కార్ల‌ త‌యారీ అంత‌రిక్ష నౌకల‌ త‌యారీ, సోష‌ల్ మీడియా ఎక్స్ తో పాటు అనేక రంగాల్లో మ‌స్క్ త‌న‌ ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తున్నాడు. తాజాగా వికీపీడియాకు పోటీగా.. గ్రోకిపీడియా(Grokipedia)ను తీసుకొచ్చారు. ఇది ఏఐ ఆధారితంగా పని చేస్తుందని.. వికీపీడియా కంటే పది రేట్లు ఎంతో బెటర్‌ అంటూ ప్రకటించారు.

ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI గ్రోకిపీడియా(Grokipedia version 0.1) ప్లాట్‌ఫారమ్‌ను ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని.. శరవేగంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమాచారం అందించడం దీని ఉద్దేశమని మస్క్‌ అంటున్నారు. అయితే..

ఇది ప్రారంభమైన కాసేపటికే భారీ ట్రాఫిక్‌ కారణంగా క్రాష్‌ అయ్యింది. దీంతో కాసేపటికి సేవల్ని పునరుద్ధరించారు. అంతేకాదు.. కొంత మంది ఇది వికీపీడియాతో పోలిస్తే కొత్తగా ఏం లేదని పెదవి విరుస్తున్నారు. పైగా ప్రాథమిక సమాచారాన్ని వికీపీడియా నుంచే తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -