నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా డకౌట్ కాకుండా 2,000 రన్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ 48 పరుగులు చేశాడు. దీంతో టీ20ల్లో 2 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. 54 ఇన్నింగ్స్‌ల్లో సుదర్శన్ ఒక్కసారి కూడా డకౌట్ అవ్వలేదు. అలాగే, టీ20 క్రికెట్‌లో వేగంగా 2,000 రన్స్ పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు మార్ష్(53 ఇన్నింగ్స్‌లు) మాత్రమే ఉన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా సుదర్శన్ బ్రేక్ చేశాడు. 2,000 పరుగులు చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా ఘనత సాధించాడు. సచిన్ 59 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. సుదర్శన్ 54 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. తాజా ప్రదర్శనతో సుదర్శన్ ఈ సీజన్‌లో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. 10 మ్యాచ్‌ల్లో 504 రన్స్‌తో టాప్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
వరల్డ్ రికార్డు సృష్టించిన సాయి సుదర్శన్..
- Advertisement -
RELATED ARTICLES