Sunday, May 18, 2025
Homeజాతీయంగుల్జార్‌ హౌస్‌ ప్రమాద ఘటన కలచివేసింది: ప్రధాని మోడీ

గుల్జార్‌ హౌస్‌ ప్రమాద ఘటన కలచివేసింది: ప్రధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామన్నారు.
గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆసుపత్రులకు తరలించారు. విద్యుదాఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -