- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎర్ర సముద్రంలో మరోసారి అలజడి రేగింది. యెమెన్ తీరంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్‌లను ప్రయోగించినట్లు బ్రిటన్ సైన్యం ఆదివారం వెల్లడించింది. వెంటనే నౌకలోని సాయుధ సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించినట్లు బ్రిటీష్ మిలటరీ ఆపరేషన్స్ సెంటర్ పేర్కొంది. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపింది. అయితే, కాల్పులకు పాల్పడిందెవరన్న దానిపై స్పష్టత లేదు.
- Advertisement -