నవతెలంగాణ-ఆలేరు రూరల్: తెలంగాణ రాష్ట్ర గ్రామ పాలన అధికారుల అసోసియేషన్ కోశాధికారిగా.. ఆలేరు మండలం కొలనుపాక గ్రామం చెందిన గ్రామ పాలనాధికారి గుర్రాల బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. హైదరాబాదులో తెలంగాణ గ్రామ పరిపాలన అధికారుల రాష్ట్ర కమిటీ సమావేశం ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా నుండి తనపై నమ్మకం ఉంచి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన కోశాధికారి పోస్టుకు న్యాయం చేస్తానని అన్నారు. గ్రామ పాలన అధికారుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర గ్రామ పరిపాలన అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు ఉపేందర్ రావు నాతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నట్లు చెప్పారు ఆలేరు మండల గ్రామ పాలనాధికారులు బాలకృష్ణను అభినందించారు.



