– భక్తిశ్రద్ధలతో సంకీర్తన ,గురు గ్రంధ పఠనం
– భారీ శోభాయాత్ర, ఆకట్టుకున్న విన్యాసాలు
నవతెలంగాణ-కంఠేశ్వర్ : నగరంలోని గాజుల్‌పేట్‌లో గల గురుద్వారాలో గురునానక్ జయంతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి గురుద్వారాలో సంకీర్తన, గురు గ్రంథ పఠనం కొనసాగింది. గురు గ్రంద్ ఔన్నత్యాన్ని భక్తులకు వివరించారు. గురు నానక్ చూపిన మార్గంలో లోకహితం ఆకాంక్షించాలని తెలిపారు. సిక్కులు తమ సాంప్రదాయాలను పాటిస్తూ గురు గ్రంధంలోని విషయాలను జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. అనంతరం సిక్కులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్న ప్రసాదంలో పెద్ద సంఖ్యలో సిక్కులు గురుద్వార్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వారాలో ప్రముఖులు పాల్గొని గురుద్వార్‌లో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో సిక్కులు పాల్గొన్నారు. సాయంత్రం గురుద్వారా నుంచి పెద్ద బజార్, నెహ్రూ పార్క్ అహ్మదీ బజార్ మీదుగా శోభాయాత్ర సాగింది. వారి విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. సిక్కులు మహిళలు తదితరులు తెలిపారు.
ఘనంగా గురునానక్ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



