Tuesday, January 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగురుకుల విద్యార్థిని మృతి ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

గురుకుల విద్యార్థిని మృతి ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాల విద్యార్థిని సంగీత మృతి ఘటనలో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కాశీనాథ్‌, ప్రిన్సిపల్ సునీతపై 106(1) BNS కింద కేసు పెట్టారు. గురుకులానికి మంజూరైన ఫర్నీచర్‌ను ప్రిన్సిపల్ సునీత తన ఇంట్లో ఫంక్షన్ కోసం వారం రోజుల పాటు వాడుకున్నట్టు గుర్తించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఫర్నీచర్‌ను పాఠశాలకు తరలించేందుకు విద్యార్థినులతో ఆటోలో తీసుకువచ్చారు. ఫర్నీచర్ దించే క్రమంలో ఆటోను ఒక్కసారిగా స్టార్ట్ చేయడంతో సంగీత మృతి చెందింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -