నవతెలంగాణ-హైదరాబాద్: హెచ్1బీ వీసాలో అమెరికా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదివరకు లక్ష అమెరికా డాలర్లు ఫీజును ఖరారు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన విషయం తెలసిందే. తాజాగా హెచ్1బీ వీసా మంజూరులో కాస్తా మినహయింపు ఇచ్చారు.ఇప్పటికే అమెరికాలో చదువుకుంటూ హెచ్1బీ వీసా దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయటి దేశాల్లో చదువుకుని అమెరికాలో ఉద్యోగం కోసం హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు మాత్రం లక్ష డాలర్లు ఫీజు కట్టాల్సిందేనని అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ తెలిపింది.
సెప్టెంబర్ 21న వీసా ఫీజు వెలువడే నాటికే అమెరికాలో ఉన్న వారు ఈ కొత్త ఫీజు కట్టనక్కర్లేదు ). సెప్టెంబర్ 21 తర్వాత వచ్చిన దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఇప్పటికే ఆన్‌లైన్ సేవలు ప్రారంభించినట్టు అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ తెలిపింది.