మేలో వేసవి సెలవులు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఏప్రిల్ నెలలో హాఫ్‌డే పద్ధతిలో నిర్వహించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. అలాగే మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇదే కాలంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సెలవులు మంజూరు చేశారు. అయితే సెలవుల సమయంలో అంగన్వాడీ సిబ్బంది కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిలో భాగంగా పిల్లలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేయాలి. 0-5 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి లోపాలను ముం దుగానే గుర్తించేందుకు ఇంటింటా సర్వేలు నిర్వహించాలి. ప్రీ-స్కూల్‌లో పిల్లల నమోదు, డ్రాప్ ఔట్ అయిన పిల్లలను మళ్లీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలి. వేసవి సెలవుల్లో అంగన్వాడీ సిబ్బంది తాము నిర్వహించిన కార్యకలాపాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగే ‘చైల్డ్ సేఫ్టీ వీక్’, మే 25 నుంచి మే 30 వరకు నిర్వహించే ‘వుమెన్ థీమ్ వీక్’ కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బంది పాల్గొనాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎంకు, సీతక్కకు ధన్యవాదాలు
హాఫ్ డేతో పాటు సమ్మర్ హాలిడేస్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ అనుబంధం) ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి.అన్నపూర్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలకుఏప్రిల్ నెలలో హాఫ్‌డే పాఠశాలలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



