- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని తన మిత్రదేశం ఇరాన్‌ను పాలస్తీనా ఆర్మ్‌డ్ గ్రూప్ హమాస్ కోరింది. ‘పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ సోదరులను కోరుతున్నాం. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ సోదరభావాన్ని కాపాడుకోవడానికి సహకరించాలి’ అని విజ్ఞప్తి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని చెప్పింది. యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
- Advertisement -


