నవతెలంగాణ- హైదరాబాద్: దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు హాన్ డక్‌సూ గురువారం ప్రకటించారు. వచ్చే నెల జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు తెలిపారు. దేశం కోసం గొప్ప బాధ్యతను స్వీకరించేందుకు తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు హాన్ టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. డిసెంబర్‌లో మార్షల్ లా విధించడంతో మాజీ అధ్యక్షుడు యూన్‌సుక్ యోల్‌ను అభిశంసనను ఎదుర్కొన్నారు. దేశంలో నెంబర్ 2 పదవి అయిన ప్రధానిగా ఉన్న హాన్ తాత్కాలిక అధ్యక్షులుగా నియమితులయ్యారు. హాన్ శుక్రవారం నుండి తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని స్థానిక మీడియా తెలిపింది. ప్రతిపక్ష లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత లీ జే-మ్యుంగ్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ద.కొరియా తాత్కాలిక అధ్యక్ష పదవికి హాన్ డక్‌సూ రాజీనామా
- Advertisement -
RELATED ARTICLES