Sunday, May 18, 2025
Homeతాజా వార్తలువిదేశాల్లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది:జాన్‌ బ్రిట్టాస్‌

విదేశాల్లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది:జాన్‌ బ్రిట్టాస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడానికి కేంద్రం సిద్ధమైంది. పాక్‌ చేసిన ఉగ్రదాడిపైనా, ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశాలకు చెప్పేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ గళం విప్పడం..అఖిలపక్ష సభ్యులు.. ఆ బృందాలకు నాయకత్వం వహించడం పట్ల తమ పార్టీ సంతోషం వ్యక్తం చేసిందని CPI(M) ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ విస్తృత లక్ష్యం కోసం పని చేయడం, విదేశాల్లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించడం మాకు సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో కొన్ని అంశాలపై మాకు విబేధాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రధానితో అఖిలపక్ష సమావేశం కానీ, పెహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్ని ఏర్పాటు చేమని అడిగినా కేంద్రం వినలేదు. ఇలాంటి అనేక అంశాలపై కేంద్రంతో మాకు విబేధాలున్నాయి. అయినప్పటికీ ఉగ్రవాదంపై కేంద్రం స్పందించడం.. విదేశాల్లో భారత్‌ ప్రాతినిధ్యం వహించడం తమ పార్టీ సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -