- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్న మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. శ్రావణమాసంతో పాటు ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. 25మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముందని స్థానిక అధికారులు తెలిపారు.ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -