నవతెలంగాణ-హైదరాబాద్: రేవంత్ రెడ్డి, హారీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేసి తనపై కుట్రలకు ప్రణాళిక సిద్దం చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించాలని జాగృతి అధ్యక్షురాలు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి హారీష్ రావు ఎప్పుడో సరెండర్ అయ్యారని ఆరోపించారు. తన తండ్రి కేసీఆర్ అస్వస్థతకు కారణం కూడా హారీష్ రావు, సంతోష్ కుమార్ కారణమని చెప్పారు. అంతే కాకుండా కేటీఆర్ ను ఓడించడానికి రూ.60లక్షలతో పలువురికి డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. పార్టీ ఫండ్ కాకుండా అంతా నగదు హారీష్ రావుకు ఎక్కడినుంచి వచ్చిందని జాగృతి అధ్యక్షురాలు మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్ లను ఎన్నికల్లో ఓడించడానికి తెరవెనుక పలు పార్టీ నాయకులతో హారీష్ రావు కుట్రలకు తెరలేపారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాని ఓడించడానికి హారీష్ తెరవెనుక రాజకీయాలు చేశారు. ఆయన ఎన్ని కుట్రలు చేసినా..తన ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కు అండగా ఉంటానని చెప్పారు.
హరీష్ రావు షూటర్ కాదని, ట్రబుల్ సృష్టించి బీఆర్ఎస్ పార్టీని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ ల పై అసెంబ్లీలో చర్చ పెట్టి కాంగ్రెస్ నిందలు వేస్తుంటే..ఆరు అడుగుల బుల్లెట్ ఏం చేస్తుందని ఎద్దేశా చేశారు. ఆ ఆరు అడుగుల బుల్లెట్..ఈ రోజు నన్ను గాయపర్చింది. రేపు రామన్నను. ఆ తర్వాత మరొకరిని గాయపర్చుతుందని ఆరోపించారు. భవిష్యత్‌లో హారీష్ రావు తో కేసీఆర్ జర జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
హారీష్ రావు కారణంగా..చెరుకు సుధాకర్, జగ్గారెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, రఘునందన్ , మైలంపల్లి లతో పాటు అనేక మంది బీఆర్ ఎస్ ను వీడిపోయారని, బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి హారీష్ రావు అనేక కుట్రలకు ప్లాన్ సిద్ధం చేశారని విమర్శలు గుప్పించారు.