నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని… రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీశ్ రావు, సంతోశ్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీశ్ రూ. 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీశ్, సంతోశ్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. సంతోశ్ రావు బాధితులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ ఉంటే ఎంత… లేకపోతే ఎంత అని తాను ఎప్పుడూ అనలేదని కవిత చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత… లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని తెలిపారు.