Wednesday, December 31, 2025
E-PAPER
Homeఆటలుఆదుకున్న హర్మన్‌ప్రీత్‌

ఆదుకున్న హర్మన్‌ప్రీత్‌

- Advertisement -

– అమన్‌జ్యోత్‌, అరుంధతి మెరుపులు
– శ్రీలంకపై చివరి టి20లోనూ టీమిండియా గెలుపు
తిరువనంతపురం :
నామమాత్రపు చివరి, ఐదు టి20లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(68) అర్ధసెంచరీతో రాణించగా.. చివర్లో అమన్‌జ్యోత్‌, అరుంధతి రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌తో భారతజట్టు 175పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. ఛేదనలో శ్రీలంక జట్టు చివరి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 160పరుగులే చేసింది. దీంతో 15 పరుగుల తేడాతో నెగ్గిన హర్మన్‌ప్రీత్‌ సేన టి20 సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు విఫలమైనా.. కెప్టెన్‌ హర్మన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్‌ అందించింది. పవర్‌ ప్లేలోనే రెండు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్‌ భారీ షాట్లతో విరుచుకుపడింది. హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మలు విఫలమైనా.. అమన్‌జోత్‌ కౌర్‌(21)తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది. ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించింది. ఆఖరి ఓవర్లో అమన్‌జ్యోత్‌ కౌర్‌(21), అరుంధతి రెడ్డి(27) మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించడంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌కు విశ్రాంతినిచ్చిన టీమిండియా..

పవర్‌ ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ అర్ధ శతకాలతో మెరిసిన షఫాలీ వర్మ(5) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యింది. అరంగేట్రం బ్యాటర్‌ కమలిని(12) తొలుత ఆత్మ విశ్వాసంతోనే కనిపించినా.. ఎల్బీగా వికెట్‌ పెవీలియన్‌కు చేరింది. దీంతో భారతజట్టు 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌(13)తో ఇన్నింగ్స్‌ నిర్మించాలనుకుంది. కానీ, రష్మిక ఓవర్లో డియోల్‌ బౌల్డ్‌ కావడంతో 41 పరుగులవద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అమన్‌జోత్‌ కౌర్‌(21), కెప్టెన్‌ కలిసి ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పరు. అయితే.. రెండో సిక్సర్‌కు యత్నించి అమన్‌జోత్‌ బౌండరీ వద్ద చిక్కింది. సెంచరీ కొట్టేలా కనిపించిన హర్మన్‌ప్రీత్‌ అనూహ్యంగా దిల్హరి ఓవర్లో క్లీన్‌ బౌల్డయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అరుంధతి రెడ్డి(27 నాటౌట్‌) చివరి ఓవర్లో 4, 4, 6, 4 తో విరుచుకుపడింది. దాంతో. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిశా దిల్హారి, ఆటపట్టు, రష్మికలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో శ్రీలంక జట్టు ఓపెనర్‌ పెరీరా(65), ఇమేషా దులాని(50 అర్ధసెంచరీలతో రాణించినా.. చివర్లో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్‌ చేసి టీమిండియాను గెలిపించారు. దీప్తి శర్మ, అరుంధతి, స్నేV్‌ా రాణా, శ్రీచరణి, వైష్ణవి శర్మ, అమన్‌జ్యోత్‌ కౌర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: షెఫాలీ వర్మ (సి)దులానీ (బి)మధుశాని 5, కమిలిని (ఎల్‌బి)కవిషా దిల్హారి 12, హర్లిన్‌ డియోల్‌ (బి)రష్మిక సెవాండి 13, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (బి)కవివా దిల్హారి 68, రీచా ఘోష్‌ (సి)కౌశాని (బి)ఆటపట్టు 5, దీప్తి శర్మ (సి)మధుషాని (బి)ఆటపట్టు 7, అమన్‌జ్యోత్‌ కౌర్‌ (సి)దిల్హారి (బి)రష్మిక సెవాండి 21, అరుంధతి రెడ్డి (నాటౌట్‌) 27, స్నేV్‌ా రాణా (నాటౌట్‌) 8, అదనం 9. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 175పరుగులు.
వికెట్ల పతనం: 1/5, 2/27, 3/41, 4/64, 5/77, 6/138, 7/142
బౌలింగ్‌: మల్కీ మదర 4-0-37-0, మధుషానీ 3-0-25-1, కవిశా దిల్హారీ 2-0-11-2, రణవీరా 4-0-39-0, రష్మిక సెవాండి 4-0-42-2, ఆటపట్టు 3-0-21-2.
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్‌: పెరీరా (బి)శ్రీచరణి 65, ఆటపట్టు (సి)దీప్తి శర్మ (బి)అరుంధతి రెడ్డి 2, ఇమేషా దులాని (సి)షెఫాలీ వర్మ (బి)అమన్‌జ్యోత్‌ కౌర్‌ 50, నీలాక్షిక శిల్వ (ఎల్‌బి)దీప్తి శర్మ 3, కవిషా దిల్హారి (బి)వైష్ణవి శర్మ 5, హర్షిత (సి)హర్లిన్‌ (బి)స్నేV్‌ా రాణా 8, కౌషాని (రనౌట్‌) హర్మన్‌ ప్రీత్‌/స్నేV్‌ా రాణా 1, రష్మిక (నాటౌట్‌) 14, మలిక మదరా (నాటౌట్‌) 5, అదనం 7. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 160 పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/86, 3/100, 4/107, 5/132, 6/140, 7/140
బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0-28-1, అరుంధతి రెడ్డి 2-0-16-1, స్నేV్‌ా రాణా 4-0-31-1, వైష్ణవి శర్మ 4-0-33-1, శ్రీచరణి 4-0-31-1, అమన్‌జ్యోత్‌ కౌర్‌ 2-0-17-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -