నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా ప్రఖ్యాత రచయిత మైకేల్ వోల్ఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బారన్‌కే కాదు.. గతంలో డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా హార్వర్డ్ అడ్మిషన్ ఇవ్వలేనట్టుందని.. అందుకే ట్రంప్ ఈవిధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మైకేల్ వోల్ఫ్ ఓ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ యంత్రాంగానికి, హార్వర్డ్‌కు మధ్య జరుగుతున్న వివాదం గురించి మాట్లాడారు.అప్పట్లో ఆయనకు కూడా హార్వర్డ్ తమ యూనివర్సిటీలో సీటు ఇవ్వనట్టుందని.. అందుకే ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు ఇటువంటి ప్రఖ్యాత సంస్థలు, వ్యక్తులను టార్గెట్ చేసుకొని.. వాటిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారని విమర్శించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై వైట్ హోస్ స్పందించింది. అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించింది.
ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ కోత విధించిన సంగతి తేలిసిందే. ఆ తర్వాత ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. దీంతో సొంత కారణాలతోనే ట్రంప్ హార్వర్డ్‌పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ట్రంప్ కుమారుడు బారన్‌కు ఆ విశ్వవిద్యాలయంలో సీటు నిరాకరించడం వల్లే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారం జరగ్గా.. ఆ వార్తలను మెలానియా ట్రంప్ కొట్టిపడేశారు. తాజాగా అదే అంశంపై మైఖేల్ వోల్ఫ్ స్పందించారు.