– దలాల్ స్ట్రీట్‌లో సెన్సెక్స్ 880 పాయింట్ల పతనం
ముంబయి: భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్‌ను రెండో రోజూ నష్టాలకు గురి చేశాయి. పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొడుతు న్నప్పటికీ.. ఈ యుద్ధ తీవ్రత పెరగొచ్చనే అంచనాల్లో మార్కెట్లు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం పతనమై 79,454.47 కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 24,008 వద్ద ముగిసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయానం, టూరిజం, రియాల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మరోవైపు రక్షణ రంగ షేర్లు రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ యథాతథంగా నమోదు కాగా.. స్మాల్‌క్యాప్ సూచీ 0.61 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ 30లో 25 స్టాక్స్ నేల చూపులు చూశాయి. ఐసిఐసిఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను చవి చూశాయి. టైటాన్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి. డ్రోన్ల తయారీ కంపెనీ ఐడియా ఫోర్జ్ షేర్లు ఏకంగా 18 శాతం లాభపడ్డాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్సీయల్ సర్వీసెస్, రియాల్టీ రంగాలు 1 శాతం పైగా నష్టపోయాయి. రియాల్టీ ఏకంగా 2 శాతం కోల్పోయింది. ఐటీ, ఎనర్జీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టాలను చవి చూశాయి.
వెంటాడిన సిందూర్ భయాలు
- Advertisement -
- Advertisement -