– టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: 90 ఏండ్లుగా తెలంగాణ గ్రామీణ క్రికెట్‌కు తీరని అన్యాయం చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ పేరుతో జిల్లాల్లో సరికొత్త డ్రామాకు తెరతీసిందని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ‘గ్రామీణ క్రికెటర్లకు నెల రోజులు పాటు నడిచే సమ్మర్ క్యాంప్‌లు అవసరం లేదు. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు రాష్ట్ర జట్లలో చోటు కావాలి. జిల్లాల నుంచి క్రికెటర్లను రాష్ట్ర జట్లకు ఎంపిక చేయటంలో హెచ్‌సీఏకు చిత్తశుద్ది లేదు. గ్రామీణ క్రికెట్‌కు టీడీసీఏ మాత్రమే న్యాయం చేకూరుతుందని’ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మే 6 నుంచి జూన్ 5 వరకు హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించనుంది.
సమ్మర్ క్యాంప్స్‌తో హెచ్‌సీఏ మాయ!
- Advertisement -