నవతెలంగాణ – ముంబయి : భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈ రోజు తన మొట్టమొదటి స్వతంత్ర వార్షిక కార్పొరేట్ సామాజిక బాధ్యత నివేదికను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నివేదిక, బ్యాంక్ తన పరివర్తన్ అనే ప్రధాన కార్యక్రమం ద్వారా సామాజిక రంగంలో దశాబ్ద కాలంగా సాధించిన ప్రభావాన్ని, గణాంకాలను వివరిస్తుంది. బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపై ₹1,068.03 కోట్లు ఖర్చు చేశామని నివేదికలో పేర్కొంది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు ₹123 కోట్ల మేర వృద్ధి చెందింది. మొత్తం మీద మార్చి 31, 2025 నాటికి, బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలకు ₹6,176 కోట్లు ఖర్చు చేసింది.
గత ఆర్థిక సంవత్సరం పరివర్తన్ కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 10.56 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది. భారత ప్రభుత్వం గుర్తించిన 112 ఆకాంక్షిత జిల్లాలలో 102 జిల్లాలలో ప్రాజెక్టులు అమలు చేసింది. బ్యాంక్ తన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కింద 298 సరిహద్దు గ్రామాలను కూడా కవర్ చేసింది.
పరివర్తన్ వ్యూహాత్మక స్తంభాలు/ప్రధాన దృష్టి రంగాలు
సీఎస్ఆర్ వార్షిక నివేదిక ఆరు ప్రధాన దృష్టి రంగాలలో బ్యాంక్ చేసిన పనిని వివరించింది:
గ్రామీణాభివృద్ధి: ఈ విభాగం ద్వారా, బ్యాంక్ వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది. గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యాన్ని అందిస్తూ, వాటిని మెరుగుపరుస్తుంది. ఇప్పటివరకు 14.92 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది చేరువైంది.
Ø విద్యకు ప్రోత్సాహం: ఈ విభాగం ద్వారా స్కాలర్‌షిప్‌లు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ అభ్యాసంతో నాణ్యమైన విద్యను బలోపేతం చేస్తుంది. బ్యాంక్ 29,000కు పైగా స్కాలర్‌షిప్‌లను అందించి, 2,600కు పైగా స్మార్ట్ పాఠశాలలను ఏర్పాటు చేయడంతో పాటు 930 కమ్యూనిటీ లైబ్రరీలను నిర్మించింది.
Ø నైపుణ్య శిక్షణ మరియు జీవనోపాధి పెంపు: యువత, మహిళలు, వ్యక్తులకు వృత్తి శిక్షణ మరియు వ్యవస్థాపక మద్దతును బ్యాంక్ అందిస్తుంది. ఇప్పటివరకు 7.2 లక్షల మంది వ్యక్తులు స్థిరమైన జీవనోపాధిని పొందేందుకు అవకాశాన్ని కల్పించింది.
Ø ఆరోగ్యం మరియు పరిశుభ్రత: ఈ విభాగం ప్రివెంటివ్ కేర్, తల్లీబిడ్డల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహనకు అవకాశాలను విస్తరిస్తుంది. మొబైల్ క్లినిక్‌లు, క్యాన్సర్ చికిత్స మద్దతు, ప్రసూతి సంరక్షణ కార్యక్రమాల ద్వారా 3 లక్షలకు పైగా వ్యక్తులు ప్రయోజనం పొందారు.
Ø ఆర్థిక అక్షరాస్యత మరియు ఇన్‌క్లూజన్: ఈ విభాగం ద్వారా బ్యాంక్ వ్యక్తులకు ఆర్థిక అవగాహనను అందిస్తూ, పొదుపులను ప్రోత్సహిస్తుంది. బ్యాంకింగ్, బీమా సేవలను అందిస్తుంది. డిజిటల్ మోసం అవగాహనపై బ్యాంక్ ప్రధాన విజిల్ ఆంటీ ప్రచారం ఆన్‌లైన్‌లో 21 లక్షల+ మంది పౌరులను చేరుకుంది.
Ø సహజ వనరుల నిర్వహణ: ఈ విభాగం ద్వారా నీటి సంరక్షణ, అటవీకరణ, జీవవైవిధ్య పరిరక్షణలో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తూ, దీర్ఘకాలిక పర్యావరణ నిర్వహణను పెంపొందిస్తుంది. బ్యాంక్ 14,520 నీటి సంరక్షణ నిర్మాణాలను సృష్టించింది. ఇప్పటి వరకు 69,000 కన్నా ఎక్కువ సౌర దీపాలను ఏర్పాటు చేసింది.17 ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో 10 కి అనుగుణంగా, ఈ ఆరు విభాగాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధికి సమగ్ర విధానాన్ని ప్రతిబింబిస్తాయి.
‘‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో, వినడం, నేర్చుకోవడం, సముదాయాల భాగస్వామ్యంతో పనిచేయడం ద్వారా అర్థవంతమైన మార్పు వస్తుందని మేము విశ్వసిస్తున్నాము. పరివర్తన్ అనేది ప్రజలు మరియు సంస్థలు తమ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి వీలు కల్పించడంలో చిన్న పాత్ర పోషించడానికి మా నిరంతర ప్రయత్నాన్ని సూచిస్తుంది. గత పదేళ్లుగా, పరివర్తన్ కింద మా ప్రయత్నాలు అభివృద్ధిని కలుపుకొని, స్థానికంగా, సంబంధితంగా మరియు భవిష్యత్తుపై దృష్టి సారించాలనే ఫిలాసఫీకి అనుగుణంగా మార్గనిర్దేశం చేయబడ్డాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరుచా వివరించారు.



