- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆమనగల్లు మండలం పులిగోనిపల్లి తండాలో బాణావత్ రాందాస్ నాయక్ అనే వ్యక్తి తాగిన మైకంలో భార్య, పిల్లలను చావబాదాడు. ఈ ఘటనలో భార్య కవిత, కుమారుడు ప్రణీత్ మృతిచెందగా, కుమార్తె హర్షిత పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ జానకి రెడ్డి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



