Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాడు ఎంపీటీసీగా ఓడి నేడు ఉప సర్పంచుగా ఎన్నికై

నాడు ఎంపీటీసీగా ఓడి నేడు ఉప సర్పంచుగా ఎన్నికై

- Advertisement -

– ముప్కాల్ ఉప సర్పంచుగా బ్రమ్మదండి చిన్నయ్య
నవతెలంగాణ-ముప్కాల్ : గత ఎంపీటీసీ ఎన్నికల్లో ముప్కాల్ ఎంపీటీసీ సభ్యులు గా పోటీ చేసి ఓటమిని పొందిన బ్రమ్మదండి చిన్నయ్య ఈ నెల 17న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వార్డు సభ్యులు గా పోటీ చేసి ముప్కాల్ ఉప సర్పంచ్ గా సోమవారం రోజు ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ప్రజాసేవ చేయాలనే తపనతో గత ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన, మనోధైర్యంతో ఈసారి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఉప సర్పంచ్ గా ముందుకు వచ్చారు. ఆయన ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తనవంతు సేవలను, అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గోని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -