Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదారుణం: కత్తితో తల్లి గొంతుకోసి..ఆపై టీవీ చూస్తూ..!

దారుణం: కత్తితో తల్లి గొంతుకోసి..ఆపై టీవీ చూస్తూ..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రొద్దుటూరులో ఓ యువకుడు కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఆ వివరాల ప్రకారం.. శ్రీరామ్ నగర్‌లో నివాసం ఉంటున్న విజయ్ భాస్కర్ రెడ్డి, లక్ష్మిదేవి భార్య భర్తలు వీరికి యశ్వంత్ అనే కొడుకు ఉన్నాడు. లక్ష్మీదేవి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో టీచర్ గా పనిచేస్తుండగా యశ్వంత్ మూడేళ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో కుమారుడికి ప్రతినెల ఖర్చుల కోసం లక్ష్మిదేవి డబ్బులు పంపిస్తున్నారు. అయితే ఇటీవలే రూ.3వేలు పంపగా యశ్వంత్ ఫోన్ చేసి మరో రూ.10వేలు కావాలని పట్టుబట్టాడు. కానీ ఇవ్వకపోవడంతో తల్లిపై పగ పెంచుకుని ఆదివారం చెప్పకుండా ఇంటికి వచ్చాడు. తండ్రి స్నానం చేసి బెడ్ రూంలో దుస్తులు మార్చుకుంటుండగా బయట నుండి డోర్ పెట్టి తల్లితో గొడవకు దిగాడు.

అనంతరం కూరగాయల కత్తితో తల్లి గొంతు కోసి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడున్నా పట్టించుకోకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బయటపడేశాడు. అనంతరం దర్జాగా ఇంట్లోకి వెళ్లి టీవీ పెట్టుకుని ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చున్నాడు. సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -