Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంనా కొడుకే పెళ్లి ఆపేశాడు..పలాష్‌ తల్లి సంచ‌ల‌నం !

నా కొడుకే పెళ్లి ఆపేశాడు..పలాష్‌ తల్లి సంచ‌ల‌నం !

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్మృతి మందాన, పలాష్‌ ముచ్చల్ వివాహ వేడుక అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో ఈ కార్యక్రమం ఆగిపోయింది. అటు వైరల్ ఫీవర్ కారణంగా పలాష్‌ కూడా ఆస్ప‌త్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. స్మృతి మందానను మోసం చేశాడని, వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని ప‌లాష్ గురించి వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో పెండ్లి ఆగిపోవడంపై పలాష్ త‌ల్లి అమిత స్పందించారు.

స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడం బాధాక‌రం అన్నారు. ఈ త‌రుణంలోనే పెండ్లి ఆపాలని ముందు తన కొడుకు చెప్పినట్లు వెల్లడించారు. స్మృతి కంటే, ఆమె తండ్రిపైన పలాష్‌కు ఎక్కువగా ప్రేమ ఉంటుందని అమిత పేర్కొన్నారు. తన కొడుకు అంటేనే శ్రీనివాస్ కు చాలా ఇష్టమని కూడా తెలిపారు. ఇక ఆయనకే గుండెపోటు రావడంతో ప‌లాష్‌ నిర్ణయం మేరకు పెండ్లి ఆగిందన్నారు. ఇక తన కుమారుడు కూడా వైరల్ ఫీవర్ కారణంగా ఆస్ప‌త్రి పాలైన‌ట్లు వివరించారు. తప్పుడు వార్తలు ప్రచురణ చేయకండి అని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -