Tuesday, November 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంలాటరీలో రూ.60 కోట్లు గెలిచాడు..ఫోన్ స్విచ్ ఆఫ్

లాటరీలో రూ.60 కోట్లు గెలిచాడు..ఫోన్ స్విచ్ ఆఫ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యూఏఈలో నివసించే శరవణన్ వెంకటాచలం అనే ప్రవాస భారతీయుడికి భారీ లాట‌రీ త‌గిలింది. ‘బిగ్ టికెట్ అబుదాబి 280’ అనే లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా 25 మి. దిర్హామ్స్(రూ.60 కోట్లు) గెలుచుకున్నారు. అబుదాబిలో నివసించే ఈయన గ‌త‌నెల‌ 30న ‘463221’ నంబరుతో ఉన్న టికెట్ కొనుగోలు చేశారు. నిన్న డ్రా తీయగా శరవణన్‌కు జాక్‌పాట్ తగిలింది. నిర్వాహకులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఈమెయిల్‌లో కూడా సంప్రదిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -