Wednesday, January 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్య చైతన్య వేదిక కాలమానిని ఆవిష్కరణ

ఆరోగ్య చైతన్య వేదిక కాలమానిని ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ : స్వచ్ఛంద ఆరోగ్య అవగాహన సంస్థ ఆరోగ్య చైతన్య వేదిక క్యాలెండర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ చేతుల మీదుగా వారి ఛాంబర్ లో ఆవిష్కరించినట్లు ఆరోగ్య చైతన్య వేదిక వ్యవస్థాపకులు రాష్ట్ర కన్వీనర్ శ్రీగన్పూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ  మాట్లాడుతూ.. స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీరు, కల్తీ లేని, కలుషితం కాని పోషకాహారం, ఆరోగ్య

అవగాన మంచి ఆరోగ్యాలవాట్లు,నిత్యం ఆచారణే ప్రజారోగ్యానికి ఆయుధం అన్నారు. పోషకాహారము, జీవనశైలి వ్యాధులు తో పాటు మనవ మనుగడకు అవసరమైన వనరులు విద్యుత్తు, భూమి, నీరు, వాతావరణము ఆడ శిశువుల సంరక్షణ కోసం కృషి చేయడం, స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఇన్చార్జిలు యాదమ్మ – బోధన్, వై శంకర్ -నిజామాబాద్ రూరల్, వి ప్రవీణ్ రెడ్డి- నిజామాబాద్ అర్బన్, డి హెచ్ ఈ వేణుగోపాల్, హెచ్ ఈ ఓ లు నాగరాజు,సురేష్, రవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -