నవతెలంగాణ-హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్ లాన్ విలేకర్లతో మాట్లడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మంత్రిగా నియమితులైన కొంతసేపటికే ఇది జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఎలిసాబెట్ లాన్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం అక్కడ ఉన్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడంతోనే ఇలా జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.