నవతెలంగాణ-ఆలేరు టౌను : ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం కుప్పలు తడుస్తున్నాయి. అకాల వర్షానికి కోతకు వచ్చిన వారి పేర్లు మొత్తం ఒరిగిపోయాయి. ఆలేరు పట్టణంలో దాదాపు 60 శాతం నుండి 70 శాతం వరకు వరిచేలు కోసినప్పటికీ, 30% వరకు మల్ల లోనే అలాగే తడిసి కోయకుండా ఉంది. ముందస్తుగా మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం 60 శాతం కాంటా పెట్టబడింది . వరుసగా వస్తున్న వర్షాల కారణంగా తడిసిన ధాన్యం రైతులు తిరిగి ఆరబెడుతున్నారు. తడిసిన ధాన్యంతో రైతులు కోలుకోలేని పరిస్థితి. భారీ తుఫాను వల్ల దెబ్బ మీద దెబ్బ పడిన పరిస్థితి. పంట చేతికొచ్చిందన్న ధీమాతో ఉన్న రైతాంగానికి, వర్షంతో పంట చేలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి చేను దాదాపు 30 శాతం నేలపై వాలింది. ఆలేరు వ్యవసాయ మార్కెట్లో గత పది రోజుల నుండి ధాన్యం తీసుకువచ్చి, తగిన విధంగా మ్యాచర్ రాకపోవడంతో వడ్లను ఎండబెడుతూ , కాంటాక్ పెడదామన్న తరుణంలో వారం రోజుల నుండి వర్షం పడడంతో వడ్లు తడి సాయి. తిండి తిప్పలు మానేసి ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద ఉండాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. ఎన్ని రోజులని, ఎండబోస్తామని ,ఎన్ని రోజులు ఎండ పోసినా రాదని , వడ్లను ఏం డబ్బు వస్తే సత్తా మాకు లేదని ,మైచర్ల తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కంట నీరు పెడుతూ కోరుతున్నారు. వరుస వర్షాల నేపథ్యంలో రైతులకు కవర్లు కప్పిన తడుస్తున్న ధాన్యం వరుసగా వర్షాలు రావడంతో ధాన్యం కుప్పల వద్ద కవర్లు రైతులు కప్పుతున్నప్పటికీ ధాన్యం తడుస్తుంది. మార్కెట్లో రైతుల కోరిన వెంటనే కవర్లు అందజేస్తున్నామని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.కుప్పల చుట్టూరా నీరు వచ్చి చేరడంతో చుట్టూ ఉన్న ధాన్యం తడుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో ఫ్యాక్స్ 150 సెంటర్లు, ఐకెపి 134, మిగతావి రైతు, మహిళ సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్నరు. మ్యాచర్ ఒక పాయింట్ తక్కువ వచ్చిన ధాన్యం కొనుగోలు కాంటాక్ట్ తీసుకోవడం లేదని రైతులు చెప్తున్నారు. ధాన్యం మార్కెట్ తీసుకువచ్చి రైతులు వారం నుండి 2 వారాల వరకు ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. కోత కోసినప్పుడు , వరి కోత మిషన్ చార్జి,ధాన్యం మార్కెట్కు తీసుకు వచ్చినప్పుడు, ట్రాక్టర్ కిరాయి, వడ్లు రోజుల తరబడి ఎండబోసేందుకు కూలీల చార్జీ తో మరింత ఖర్చులు పెరుగుతున్నాయని, పెరుగుతున్న ఖర్చులతో భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమతో సంబంధం లేకుండా దన్యం కాంటా పెట్టమని అధికారులను వేడుకున్నప్పటికీ వినడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ మార్కెట్లో నూతన గోడౌన్స్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో,ఒక వైపు నుండి పందులు వచ్చి , ధాన్యం కుప్పలపై పడి స్వైర విహారం చేస్తున్నాయని ,ధాన్యం బుక్కుతున్నాయని రైతులు వాపోతున్నారు.కుప్పలు వద్ద తిండి తిప్పలు లేకుండా మార్కెట్లో పడిగాపులు కాస్తున్నామని, ఎప్పుడు వచ్చిన ధాన్యాన్ని అప్పుడు, కొనుగోలు చేయాలని రైతులకు కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు , రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సమీక్షిస్తు ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తొదని, ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలని ,సంబంధిత మార్కెట్ అధికారులను ,ఏపీఓలకి ఏరోజుకారోజు లెక్కలు అడుగుతూ మార్కెట్లో ధాన్యం కొనుగోలు గురించి ఆరా తీస్తున్నారు. పరస వర్షాలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వరుసగా కురుస్తున్న వర్షాలతో తడుస్తున్న ధాన్యం కుప్పలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



