నవతెలంగాణ-హైదరాబాద్: గ్రూప్-1 మెయి న్స్ పరీక్ష పేపర్లను తిరిగి మూల్యాంక నం చేయాలని లేనిపక్షంలో తిరిగి పరీక్షలను నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై బుధవారం హైకోర్టు విచారణ చేయనుంది. అవకతవకలు జరిగాయని చెప్పి మొత్తం ఎంపికను రద్దు చేయడం చెల్లదని పరీక్షల్లో అర్హతపొందిన అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు. తప్పు చేసిన వా ళ్లపై చర్యలు తీసుకోవాలేగానీ అర్హత పొందిన 563మంది అభ్యర్థులకు శిక్ష విధింపు చెల్లదని పేర్కొన్నా రు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ దాఖలైన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీ ఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కే లక్ష్మీనరసింహ, సర్వీస్ కమిషన్ న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపించారు. సర్వీస్ కమిషన్ కూడా అప్పీల్ చేయడంతో రెండింటినీ కలిపి విచారిస్తామని ప్రకటించింది.
నేడు గ్రూప్-1పై అప్పీల్ పిటిషన్లపై విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES