- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కేసు విచారణ ఆగస్ట్ 12,13 తేదీల్లో ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. 65 లక్షల మందిని ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించారని, వారు మరణించారు లేదా శాశ్వతంగా వేరే చోటుకి తరలించబడ్డారని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) పేర్కొందని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థగా హోదాకు అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా ఇసిఐ చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చింది.
- Advertisement -