నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్‌ఐఆర్‌ను వాయిదా వేయాలని కోరుతూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బి.ఆర్.గవాయ్ ఎదుట ప్రస్తావించారు. ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకుంటామని ఆయన సూచించారు.
నవంబర్ 4 నుండి డిసెంబర్ 4 వరకు జరగాల్సిన ఎస్‌ఐఆర్‌ని వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ స్థానిక సంస్థల ఎన్నికలకు విరుద్ధంగా ఉందని, మానవ వనరుల ఒత్తిడికి దారితీస్తుందని, పరిపాలనా ప్రతిష్టంభనకు దారితీస్తుందని, దీంతో ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కేరళ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది.



