- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 5,81,628 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. డ్యామ్ అధికారులు 24 గేట్లను 15 అడుగులు, 2 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 531534 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 584.10 అడుగులకు చేరుకుంది. ఎడమ, కుడి కాల్వలకు, హైదరాబాద్ తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నారు.
- Advertisement -