- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,72,705 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 67,563 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 881.60 అడుగులు ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నారు. కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థం 215.708 టిఎంసిలుకాగా ప్రస్తుతం 166.3148 టిఎంసిలుగా ఉందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -