Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంభారీ వర్షం.. షుగర్ ఫ్యాక్టరీకి రూ.50 కోట్ల నష్టం

భారీ వర్షం.. షుగర్ ఫ్యాక్టరీకి రూ.50 కోట్ల నష్టం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగరంలోని యమునానగర్‌ సరస్వతి షుగర్‌ మిల్ ప్రాంతమంతా జలమయమైంది. ఈ నీటి ధాటికి ఆసియాలో అతిపెద్ద షుగర్‌ మిల్‌ గా పేరుగాంచిన గిడ్డంగిలో 2.20లక్షల క్వింటాళ్ల పంచదారను నిల్వ చేశారు. దాని మొత్తం విలువ రూ.97 కోట్లు. అయితే వర్షాల కారణంగా పక్కనున్న కాల్వ పొంగి నీరు మిల్లులోకి చేరిందని సరస్వతి షుగర్ మిల్‌ జనరల్ మేనేజర్ రాజీవ్‌ మిశ్రా వెల్లడించారు.

దీనివల్ల క్వింటాళ్ల కొద్దీ పంచదార తడిసిపోయింది. దాని విలువ రూ.50- 60 కోట్ల వరకు ఉంటుంది. ఒకసారి గిడ్డంగి మొత్తాన్ని పరిశీలించి పూర్తి నష్టాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రూ.కోట్లలో నష్టం జరిగినప్పటికీ స్థానిక మార్కెట్లలో పంచదార లభ్యతపై ప్రభావం ఉండదని మిశ్రా వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -