నవతెలంగాణ-హైదరాబాద్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారీ వర్షం కారణంగా ద్వారకలోని ఖర్జరి కెనాల్ గ్రామంలో ఓ వ్యవసాయ భూమిలో నిర్మించిన ట్యూబ్‌వెల్ గదిపై భారీ వృక్షం కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త అజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
- Advertisement -