- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు గంటల్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు.. సూచనలు చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ పరిధిలో ఉన్న బీరంగూడ, ఆర్సిపురం, శేరిలింగంపల్లి , మియాపూర్, చంద్రాయన గుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, బాలాపూర్ శంషాబాద్ రాజేంద్రనగర్ హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో… భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
- Advertisement -