- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేడు, రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
- Advertisement -