- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నిన్న సిటీ శివారు ప్రాంతాలు వనస్థలిపురం నుంచి హయత్ నగర్ వరకు భారీ వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే. తాజాగా హయత్ నగర్ లోని ఓ ఇంటి పునాది కొట్టుకుపోవడంతో బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఇంటి పునాది కొట్టుకుపోవడంతో బిల్డింగ్ పక్కకు ఒరిగింది. ఏ క్షణాన కూలుతుందో అని భయపడుతున్నారు స్థానికులు. భవనం మెల్లగా పక్కకు ఒరుగుతున్న క్రమంలో భయబ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఇంటిని ఆనుకొని హైటెన్షన్ 11 కేవీ విద్యుత్ తీగలు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరుగుతుందేమోనని అంతా టెన్షన్ పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆస్థి ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు.
- Advertisement -