హైదరాబాద్‌లో భారీ వర్షం..

నవతెలంగాణ – హైదరాబాద్: నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి ఎండ కొట్టగా.. మధ్యాహ్ననికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ క్రమంలోనే నగరంలోని పలు చోట్ల వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మాసబ్ ట్యాంక్, నార్సింగ్, ఉప్పల్, ఎల్బీనగర్, హాబ్సిగూడ, తార్నాకతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Spread the love