- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కోఠి, బాగ్ లింగంపల్లి, విద్యానగర్, ముషీరాబాద్, రాంనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
- Advertisement -