Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లి లో భారీ వర్షం ..

కమ్మర్ పల్లి లో భారీ వర్షం ..

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత రెండు మూడు రోజులుగా అడపాదడపా వర్షం కురిసిన, శనివారం సాయంత్రం మాత్రం  అరగంటకు పైగా ఏకదాటిగా వర్షం పడింది. భారీ వర్షంతో వారాంతపు సంతలో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. సంతలో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు కూడా భారీ వర్షం మూలంగా సరుకులు కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వినాయక నిమజ్జనాలకు చివరి రోజు కావడంతో నిమజ్జనం ఊరేగింపులు నిర్వహించే యువకులు కూడా వరుణుడు తమ సంతోషంపై నీళ్లు చల్లారని నిరాశ వ్యక్తం చేశారు. అయితే భారీ వర్షం పడడం పట్ల రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. భారీ వర్షం మూలంగా పలుకానుల్లో మట్టి రోడ్లు బురద మాయంగా మారాయి.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -