నవతెలంగాణ-హైదరాబాద్ : కోల్‌కతాలో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల వల్ల కోల్‌కతాలో అయిదుగురు మృతిచెందారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్, రబీంద్ర సరోబర్ స్టేషన్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ప్రయాణికుల క్షేమం కోసం షాహిద్ ఖుదిరామ్, మైదాన్ స్టేషన్ల మధ్య మెట్రో సర్వీసులను నిలిపివేశారు. దక్షిణేశ్వర్, మైదాన్ స్టేషన్ల మధ్య ట్రంక్ సర్వీసులు నడుస్తున్నాయి. నీరు నిలిచిన ప్రదేశంలో పంపుల ద్వారా తొలగిసత్ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్, షాపులు నీట మునిగాయి. హౌరా ప్రాంతంలో కూడా వర్షం వల్ల అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కోల్‌కతాలో భారీ వర్షం.. అయిదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES