Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, కొండాపూర్ ,షేక్ పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, బాలాపూర్, మీర్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోటి, అబిడ్స్, లక్డికపుల్, బసీర్ బాగ్ లో భారీ ర్షానికి రోడ్ల పై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.

భారీ వర్షం పడుతుండడంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతోంది. ద్విచక్ర వాహనాలు మెట్రో స్టేషన్లు, బ్రిడ్జీలు, షటర్ల కింద తలదాచుకుంటున్నారు. వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు జామ్ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండటంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయల్దేరాలని సూచించారు. మరో వైపు తెలంగాణకు మూడు రోజులు పాటు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. వచ్చే మూడు గంటలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad