నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది. వాహనాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో వాహనదారులు ఇతర మార్గాలను ఎంచుకున్నారు. పోలీసులు, నగరపాలక సంస్థ సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడంతో స్థానికులే రోడ్డుకు అడ్డంగా భారీకేడ్లు పెట్టి వాహనదారులను అప్రమత్తం చేశారు. సుమారు 10 అడుగుల మేర వరద నీరు చేరడంతో ఈ మార్గాన్ని మూసేశారు. ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలను కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాతోపాటు కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. సాగునీటి కొరతతో ఇబ్బంది పడ్డ రైతులకు ఈ భారీ వానలు కాసింత ఉపశమనం కలిగించాయి.
నిజామాబాద్‌లో భారీ వర్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES