- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మాసబ్‌ట్యాంక్, అమీర్‌పేట వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉక్కపోతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఇదిలా ఉండగా సంగారెడ్డిలో వడగండ్ల వాన కురిసింది. అలాగే ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరులో వర్షం దంచికొట్టింది. అలాగే ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది.ఈ మేరకు ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణశాఖ వర్షసూచన చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



